బొర్రా వెంకటేశ్వరరావుకి అధికారుల ఘన నివాళులు

కొండపల్లి (ఎన్టీఆర్‌ జిల్లా) : ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసీ సభ్యులు బొర్రా వెంకటేశ్వరరావు సంస్మరణ కార్యక్రమం కొండపల్లిలో సోమవారం జరిగింది. ఈ సంస్మరణ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాదు హాజరయ్యారు. వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బొర్రా వెంకటేశ్వరరావు సేవలను స్మరించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. వెంకటేశ్వరరావు కుమారులు బొర్రా కిరణ్‌ని, బొర్రా క్రాంతిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ఎన్‌. తులసిరెడ్డిని పలుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️