ఉంగుటూరు సచివాలయాన్ని సందర్శించిన అధికారులు

ప్రజాశక్తి – ఉంగుటూరు (ఏలూరు) : కేంద్ర ప్రభుత్వం ప్రయోజత అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్న తీరును పరిశీలించేందుకు ఎన్‌ఎల్‌ఎం అధికార బృందం మంగళవారం ఉంగుటూరు మండలం కాగుపాడు సచివాలయాన్ని సందర్శించింది. ఐ సి డి ఎస్‌, హౌసింగ్‌, ఉపాధి హామీ తదితర 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పథకాలు, వాటి లబ్ధిదారుల వివరాలను, అందుతున్న తీరును వివరించారు. ఎన్‌ ఎల్‌ ఎం అధికారులు సూర్యకాంత్‌ ప్రధాన్‌, అశోక్‌ కుమార్‌ సాదు, ఉంగుటూరు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి గంజి రాజ్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ కడియాల సుదేశ్ణ, డ్వాక్రా సచివాలయం, తదితర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️