ఒకపూటే ఉపాధి పనులు పెట్టాలి

Apr 14,2025 22:02

 ప్రజాశక్తి-బాడంగి : ఉపాధి పనులు రెండు పూటలా పెట్టొద్దని, ఒకపూటే పెట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సురేష్‌.. అధికారులను డిమాండ్‌చేశారు. మండలంలో బొత్సవానివలసలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రంగా ఉండడంతో కూలీలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు. రెండు పూటలా పనిచేసినా సరే సక్రమంగా బిల్లులు పడే పరిస్థితి లేదన్నారు. కూలి గిట్టుబాటయ్యే చూసి, పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

➡️