వంద రోజుల ‘హౌ’సింగ్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో వంద రోజుల హౌసింగ్‌ ప్రణాళిక నత్తన డకన సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌ నాలుగో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వంద రోజుల్లో లక్ష పక్కాగృహాలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్ర హౌసింగ్‌ డిపార్టుమెంట్‌ ఆదేశాల మేరకు జిల్లా హౌసింగ్‌ యంత్రాంగం వంద రోజుల ప్రణాళికలో భాగంగా తొమ్మిది వేల పక్కా గృహాలను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను మదింపు వేసుకున్న అనంతరం ఆరు వేల పక్కాగృహాలను పూర్తి చేస్తామని లక్ష్యాన్ని కుదించుకుంది. జిల్లా హౌసింగ్‌ యంత్రా ంగం 2025 నాటికి పెండింగ్‌ పక్కా గృహాలను పూర్తి చేయా లని, లేనిపక్షంలో పిఎంజిఎస్‌వై స్కీమ్‌ ముగిస ిపోయే ప్రమా దం ఉందని అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.జిల్లాలో 94 పక్కాగృహాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. 89,984 ఇళ్ల నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. మైదుకూరు, పులివెందుల, కమలాపురం డివిజన్లలో పురోగతి కనిపిస్తోంది. కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో ఆశించిన పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 36 వేల ఇళ్లు పూర్తయ్యాయి. ఈలెక్కన 41 శాతం మేరకు పనులు చేపట్టిన్లు తెలుస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో డిసెంబర్‌ నాలుగో వారం నాటికి వంద రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆరు వేల పక్కాగృహాలను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. హౌసింగ్‌ యంత్రాంగం ముందుకు కదులుతోంది. ఇప్పటి వరకు 2,000 పక్కాగృహాల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేసింది. రాబోయే 30 రోజుల వ్యవధిలో లక్ష్యాన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. మరో నెల రోజుల వ్యవధిలో మరో 500 పక్కాగృహాలకు మించి పూర్తి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. మౌలిక వసతుల కుంగుబాటు జిల్లాలోని 436 లేఅవుట్లలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. మౌలిక వసతుల కొరత కారణంగా ఆశించిన రీతిలో పక్కా గృహాల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. జిల్లా హౌసింగ్‌ యంత్రాం గం ఆయా లేఅవుట్ల వారీగా సమస్యల్ని అధ్యయనం చేయడంపై దృష్టి సారించింది. ప్రతి లేఅవుట్‌ లోనూ నీటి సరఫరా, రహదారులు, ఎలక్ట్రిఫికేషన్‌, వస్తువుల అపహరణ వంటి సమస్యల్ని, సదుపాయాల లోపాల్ని గుర్తించింది. ఎలక్ట్రిఫికేషన్‌ సదుపాయాల కల్పనకు చొరవ తీసుకున్నట్లు చెబుతోంది. నీటిసరఫరా, రహదారుల, దొంగతనాల నిరోదం అంశాల్లో నిమ్మకుండి పోయినట్లు తెలుస్తోంది.రూ.8 కోట్ల బకాయి పెండింగ్‌! హౌసింగ్‌ పనులను మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. లేఅవుట్లలో నెలకొన్న సమస్యల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. హౌసింగ్‌ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు, బకాయిలపై ఆరా తీసింది. రూ.ఎనిమిది కోట్ల మేరకు నీటి సర ఫరా బకాయి పేరుకుని ఉన్నట్లు గుర్తించింది. పెండింగ్‌ బకాయి ప్రతిపాదనల్ని ప్రభుత్వా నికి నివేదించినట్లు తెలు స్తోంది.11 వేల మందికి నోటీసులుపిఎంజిఎస్‌వై స్కీమ్‌-2025 నాటికి ముగిసి పోనుంది. జిల్లా హౌసింగ్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పెండింగ్‌ లబ్ధిదారులను గుర్తించి పక్కాగృహాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరుతోంది. అవగాహనా కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి నోటీసులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 18 వేల మంది పెండింగ్‌ లబ్ధిదారులు ఉండగా, ఏడు వేల మంది పెండింగ్‌ పనులు పూర్తి చేశారు. మిగిలిన 11 వేల మంది పెండింగ్‌ ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల వ్యవహారం చర్చనీ యాంశంగా మారింది.మౌలికం కొరత వాస్తవమే పక్కాగృహాల లేఅవుట్లలో మౌలిక వసతుల కొరత ఉన్నమాట వాస్తవమే. వంద రోజుల ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.- రాజారత్నం, హౌసింగ్‌ పీడీ, కడప.

➡️