లక్ష్యసాధనలో వంద శాతం ఫలితాలు సాధించాలి

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమాలను అత్యంత పటిష్టంగా నిర్వహించి లక్ష్యసాధనలో వంద శాతం ఫలితాలకు కషి చేయాలని 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్‌ లంకా దినకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన చైర్మన్‌ను కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, జెసి ఆదర్శ్‌ రాజేంద్రన్‌ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని విసి హాలులో జిల్లాలో 20 సూత్రాల కార్య క్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో చైర్మన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లా సమీక్షలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలలో పురోగతి మీద సమీక్ష నిర్వహించటానికి వచ్చానన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షించారు. స్థూలంగా సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం అందించడంలో, వివరించడంలో అధికారుల మధ్య కొంత సమన్వయ లోపం ఉందన్నారు. ఉపాధి హామీ, జల్‌ జీవన్‌ మిషన్‌, అమత్‌ పథకం 1, 2, పీఎం ఆవాస్‌ యోజన, టీడ్కో గహాలు, పీఎం సూర్య ఘర్‌ పథకం, పీఎం కుసుమ్‌ వ్యవసాయానికి విద్యుత్‌ అందించే పథకం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న యూరియా సబ్సిడీ, జాతీయ ఆహార భద్రత పథకం, గరీబ్‌ కళ్యాణ అన్న యోజన తదితర అంశాలలో సమగ్రంగా సమీక్షించారు. శాఖల మధ్య సమన్వయంతో పథకాల అమలుకు కషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని రూపొందించాలన్నారు. ఉపాధికి సంబంధించి 300 రావాల్సిన వేతనం 259గా ఉంది దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో ఆ దిశగా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో దాదాపు రెండు లక్షల పైబడిన వారికి పనులు కల్పించడం జరిగింది. అందులో 8588 కుటుం బాలు 100 పని దినాలు పూర్తి చేసుకున్నాయి. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కు సంబంధించి ఏడాది రూ.132 కోట్లు అంచనా కాగా, రూ.102 కోట్లు ఖర్చు చేశారు. రాబోయే రెండు నెలల కాలంలో సాధ్యమైనంత ఎక్కువ పనులు కల్పించి వందశాతం లక్ష్యసాధనకు కషి చేయాలని సూచించారు. జిల్లాలో సరైన అంచనా నివేదికలు రూపొందించాలన్నారు. పీఎం ఆవాజ్‌ యోజన సంబంధించి దాదాపు 79,720 గహాలు మంజూరు కాగా, ఇప్పటికి 37,2502 ఇండ్లు పూర్తి చేసినట్లు తెలుస్తోందిన్నారు. టిడ్కో గహాలకు సంబంధించి మొత్తం 3936 గహాలు ఉండగా 2112 ఇల్లు పూర్తయి అందులో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలపడం సంతప్తికరంనారు. పారిశుద్ధ పనులను కూడా మెరుగుపరచాలని సూచించారు. వ్యవసాయానికి డ్రోన్ల సహాయం అంశంలో భవిష్యత్తులో మండలానికి, ప్రతి పంచాయతీకి ఒక డ్రోన్‌ కేటాయించే లాగున కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కార్డులు దాదాపు 5 లక్షలకు పైబడి ఉన్నాయి. తద్వారా 16 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, డిఆర్‌ఓ మధుసూదన్‌ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️