ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : కారు టైరుపేలి అదుపుతప్పి బావిలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన ఘటన శుక్రవారం నార్పలలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు … తాడిపత్రి నుండి ధర్మవరం వైపు వెళుతున్న కారు టైరు పేలి నార్పల మండల పరిధిలోని నడిమి దొడ్డి గ్రామ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో కారులో ప్రయాణం చేస్తున్న అనంతపురానికి చెందిన షాబుద్దీన్ మృతి చెందగా, ఇర్ఫాన్ గాయపడ్డాడు మృతులు అనంతపురం గుల్జార్ పేటకు చెందినవారుగా తెలిసింది. సంఘటన స్థలానికి నార్పల పోలీసులు చేరుకొని స్థానికుల సహకారంతో బావిలో పడ్డ కారును బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
