కన్నీళ్లతో ఒకరు.. ఆస్పత్రి నుండి మరొకరు..

Apr 23,2024 21:48

నగదు ప్రోత్సాహకాలతో 500కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులు.. ఇన్‌సెట్‌లో తండ్రి చనిపోయినా పరీక్షలు రాసిన షాజహాన్‌, జ్వరంతో పరీక్ష రాసిన ఫర్హాత్‌
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
పట్టి పీడించిన ఆనారోగ్యం.. తండ్రి చనిపోయిన దుఖ: వారిని కుంగదీసినా పరీక్షల్లో మాత్రం లొంగదీసుకో లేకపోయాయి. పరీక్షలకు ముందు పదిరోజుల పాటు జ్వరం బారిన పడినా ప్లేట్లెట్లు పడిపోయి ఆరోగ్యం క్షీణించి నా పట్టుదలగా చదివిన షేక్‌ ఫర్హాత్‌ పదో తరగతి పరీక్షల్లో 556 మార్కులతో పాఠశాల ద్వితీయ స్థానాన్ని సాధిం చారు. పరీక్షలు మొదలైన రెండో రోజునే తండ్రి చనిపోగా కన్నీటిని తుడుచుకుంటూనే పరీక్షకు హాజరైన షాజహాన్‌ 553 మార్కులతో పాఠశాలలో మూడో స్థానంలో నిలిచారు. పట్టుదలతో చదివితే, లక్ష్యాన్ని సాధించాలను కుంటే ఏ అవరోధమైనా అడ్డుకోలేదని నిరూపించారు పసుమర్రులోని శ్రీ మద్ది కామయ్య జెడ్‌పి విద్యార్థులు.ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచ్చి నందుకుగాను వారిని అభినం దిస్తూ పాఠశాలలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఎర్రం వెంకట సుబ్బయ్య అధ్యక్షతన మంగళ వారం అభినందన సభ నిర్వహించారు. హెచ్‌ఎం యడవల్లి హనుమంతరావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా తమ పాఠశాల 91 శాతం ఉత్తీర్ణతతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని, విద్యార్థులూ అత్యధిక మార్కులు సాధించారన్నారు. 573 మార్కులతో షేక్‌ అఫ్రోజహ మొదటి స్థానం సాధించగా తరువాతి స్థానాల్లో షేక్‌ షీమా ఫర్హాత్‌, షేక్‌ షాజహాన్‌ నిలిచారన్నారు. షీమా ఫర్హాత్‌ పరీక్షలకు ముందు జ్వరంతో ప్లేట్లెట్స్‌ పడిపోయి హాస్పిటల్లో ఉన్నారని, పరీక్షల కోసమే చేతికి ఐవికాన్‌ పెట్టుకుని రాశారని గుర్తు చేశారు. షాజహాన్‌ తండ్రి పరీక్షలు మొదలైన రెండవ రోజే మరణించినా గుండె ధైర్యం కోల్పోకుండా పరీక్షలకు రాశారని చెప్పారు. వీరితోపాటు 9 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారన్నారు. వీరికి బహుమతులు అందించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రూ.5 వేలు, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెరికల్చర్‌ కొణతం సిరీల్‌ కుమార్‌ రూ.5 వేల ఆర్థిక ప్రోత్సాహకాలను అందించారు. మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.2 వేలు, మిగతా ఎనిమిది మందికి రూ.వెయ్యిచొప్పున అందించారు.

➡️