పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు పాలకొల్లుకి కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జిసి రాజమండ్రి ప్రాంతీయ అధికారులు, ఉన్నత ఉద్యోగులతో సోమవారం రాత్రి మంత్రి నిమ్మల రామా నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓఎన్జిసి అధికారులు వివిధ రాష్ట్రాల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.. వారి సేవలను కొనియాడుతూ మదర్ తెరిసా స్ఫూర్తితో తన తండ్రి పేరుతో ఏర్పాటుచేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పాలకొల్లు నియోజకవర్గం లో చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా మంత్రి వివరించారు. చిన్న డాక్యుమెంటరీ రూపంలో చూపించారు కూడా. ఈ సందర్భంగా ఓ ఎన్ జి సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎసెట్ మేనేజర్ సంతాన్ దాస్, వారి బఅందంలోని ఇతర అధికారులు రామానాయుడు సేవా నిరతిని కొనియాడుతూ శాలువా కప్పి సన్మానించారు. మంత్రి రామానాయుడు కూడా సంతాన్ దాస్ కు జ్ఞాపిక అందజేసి ప్రశంసించారు. ఓఎన్జిసి సి ఎస్ ఆర్ నిధులు పాలకొల్లు నియోజవర్గానికి కేటాయించమని మంత్రి కోరారు.
ఓఎన్జీసీ సిఎస్‌ఆర్ నిధులు పాలకొల్లుకు కేటాయించాలి : మంత్రి నిమ్మల వినతి
