ప్రజాశక్తి-విజయనగరంకోట : పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్ష సజావుగా కొనసాగుతోందని ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం 9వ రోజు పిఎంటి. పిఇటి పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 408 మంది మాత్రమే హాజరయ్యారు. వేకువ జామున 5గంటల నుండే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్‌పి వకుల్‌జిందాల్, ఎఎస్‌పి పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్‌పి జి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అభ్యర్ధులకు ముందుగా హాల్ టికెట్స్ పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం, అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధవపత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్ధులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని పిఎంటి పరీక్షలకు అనుమతించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/police-4.jpg)