కొనసాగుతున్న కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక ప్రక్రియ

Jan 7,2025 21:24

ప్రజాశక్తి-విజయనగరం కోట :  స్టయిఫండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పిఎంటి, పిఇటి పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మంగళవారం నిర్వహించిన 7వ రోజు పిఎంటి, పిఇటి. పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 351 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నియామకాల ప్రక్రియను ఎస్‌పితో పాటు అదనపు ఎస్‌పి పి. సౌమ్యలత పర్యవేక్షించారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్‌ ఇక్విప్మెంట్స్‌ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులకు పిఇటి పరీక్షలను అనుమతించామని తెలిపారు.

➡️