ప్రజాశక్తి – గణపవరం (పశ్చిమ గోదావరి) : గణపవరం డిగ్రీ కాలేజిలో బుధవారం ఓపెన్ డే కార్యక్రం నిర్వహిస్తున్నట్లు కాలేజి ప్రిన్సిపాల్ పి నిర్మలాకుమారి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈసందర్భంగా నిర్మలాకుమారి మాట్లాడుతూ కాలేజీలో ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ చాణక్య కాలేజి విద్యార్థులు ప్రిన్సిపాల్ సిబ్బంది గణపవరం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఇంటర్మీడియట్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్దినీ విద్యార్థులు వారితల్లితండ్రులు ఈ కార్యక్రమానికి ఆహ్వనిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా కళాశాలలో ఉన్న అన్ని రకాల కోర్సలు, వసతులు సౌకర్యాలు, అధ్యాపకుల టీమ్ వాటి గురించి పవర్ పాయింట్ ద్వారా వివరిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొనాలని ఆమె ప్రకటనలో తెలిపారు.
