పంపనూరులో అంగన్‌వాడి కేంద్రం ప్రారంభం

Oct 30,2024 14:42 #Anganwadi Center, #Opening, #Pampanur

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో నూతన అంగన్‌వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, వి,ఐ.ఏ.ఎస్‌ ప్రారంభించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తోపాటు రాప్తాడు ఎమ్మెల్యే కుమారుడు, యువ నాయకులు పరిటాల శ్రీరామ్‌, ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్‌ మంచూ ఫెర్రర్‌, ఐసిడిఎస్‌ పిడి డా.బిఎన్‌ శ్రీదేవి, తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గని, అనంతరం జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే కుమారులు, ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్‌, తదితరులు అంగన్‌వాడి కేంద్రంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అంగన్‌ వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్డిటి సంస్థ 21 లక్షల రూపాయల నిధులతో పంపనూరు గ్రామంలో అంగన్‌ వాడి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భవతులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌ వాడి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నాగరాజునాయుడు, డిఎల్డిఓ లలితా బాయి, సర్పంచ్‌ ఎర్రిస్వామి, సిడిపిఓ ధనలక్ష్మి, సూపర్వైజర్లు లావణ్య, శ్రీవాణి, ఐసిడిఎస్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

➡️