విశాఖలో ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ప్రారంభం

Feb 4,2024 15:52 #hospital, #visakhapatnam

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ): నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-11లో ఆదివారం ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ప్రముఖ విద్యావేత్త గాయత్రి సంస్థల సెక్రటరీ డాక్టర్‌ పి.సోమరాజు ప్రారంభించారు. ఈ క్లినిక్‌ ద్వారా డాక్టర్లు సూర్యతేజ వెన్నెలకంటి, అశ్విని మాచిరాజు తమయొక్క సేవలు అందిచనున్నారు. డాక్టర్‌ సూర్యతేజ సిఎంసి వెల్లూరు నుండి వయోవద్దుల ప్రత్యేక చికిత్స (జీరియాట్రిక్‌)లో శిక్షణ పొంది విశాఖపట్నం లో జీరియాట్రక్‌ క్లినిక్‌ సేవల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌ అశ్విని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ నుండి ఎండోక్రైనిలజీ లో పట్టభద్రులు అయ్యారు. రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషన్స్‌, యూకే నుండి స్పెషాలిటీ సర్టిఫికేట్‌ ఇన్‌ ఎండోక్రైనిలజీ అండ్‌ డయాబెటీస్‌ పట్టాను కూడా పొందారు. పిల్లలు, పెద్దలలో వచ్చే హార్మోన్‌ సంబంధిత ( డయాబెటీస్‌, ఊబకాయమ్‌, థైరాయిడ్‌, పిసీఓఎస్‌, పిట్యూటరీ గ్రంధి సమస్యలు) సమస్యల వైద్య నిపుణులుగా ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ద్వారా ఫార్మసీ, లాబొరేటరీ, ఫిజియోథెరపీ, రిహాబ్‌, డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా చెప్పులు తయారి, హౌమ్‌ విజిట్స్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లినిక్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు వైద్య నిపుణులు, వ్యాపారవేత్తలు డాక్టర్‌ సూరి తేజ, డాక్టర్‌ అశ్వినిలకు అభినందనలు తెలిపారు.

➡️