చిన్న వ్యాపారులపై మున్సిపల్‌ అధికారుల జులుం..

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల ప్లై ఓవర్‌ కింద పెట్టుకున్న చిన్న చిన్న అంగళ్ళను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లి కోవెలకుంట్ల రోడ్డు ప్లై ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద చిన్న, చిన్న షాప్‌ లు, టీ స్టాల్స్‌ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్న చిరు వ్యాపారుల పైన మున్సిపల్‌ అధికారులు జులుం ప్రదర్శించారు. జె సి బి ల సహాయంతో బంకులను అంగళ్ళను తొలగించారు. మున్సిపల్‌ అధికారుల తీరు పైన స్థానికులు మండిపడుతున్నారు. అన్యాయంగా ఎకరాలకుఎకరాలను ఆక్రమించే వారిని వదిలిపెట్టి … ఏదో చిన్న కొట్లను పెట్టుకునే చిరు వ్యాపారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

➡️