తర్తూరు అంచ దగ్గర ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి : సిపిఎం

Apr 17,2025 16:50 #CPIM, #nandyala

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : జూపాడు బంగ్లా మండలం తర్తూరు అంచ దగ్గర ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, సిపిఎం నాయకులు పి పకీర్ సాహెబ్ లు మాట్లాడుతూ కర్నూలు నుండి ఆత్మకూరుకు వెళ్లే నేషనల్ హైవే రోడ్డు జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామం అంచ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వెయ్యకపోవడం మూలంగా ఇటీవల ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. తర్తూరు జాతర రాయలసీమ లో ప్రఖ్యాతి కాంచినదని, రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని తెలిపారు. తర్తూరు గ్రామానికి వెళ్లేందుకు, మండ్లేం గ్రామాలకు వెళ్లేందుకు బ్రిడ్జి లేకపోవడం మూలంగా నేషనల్ హైవే పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం అధికారులు బాధ్యతరహితంగా నిర్లక్ష్యం కారణంగా ఇంజనీరింగ్ ప్లానింగ్ తప్పుడు రిపోర్ట్ ఆధారంగా బ్రిడ్జి నిర్మించకపోవడం మూలంగా చనిపోయిన ప్రాణాలకు వారే బాధ్యత వహించాలని వారి హెచ్చరించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎంపీ వెంటనే జోక్యం చేసుకొని తర్తూరు అంచదగ్గర బ్రిడ్జి ఏర్పాటు చేయాలని టిఫిన్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ ఉస్మాన్ భాష, అబ్దుల్ రషీద్, దూదేకుల బాబు, ఆర్ఎంపీ డాక్టర్ మౌలాలి , ప్రశాంత్, ఆటో కార్మికులు ఇమ్రాన్, హుస్సేన్ భాష ,మున్నా ,మనోజ్ ,నూర్ భాషా, నందిని, వెంకటేశ్వర్లు ,రాఘవ, రమేష్ తదితరులు పాల్గొన్నారు

➡️