పారిశ్రామిక సందర్శనలో ‘పేస్‌’ విద్యార్థులు

ప్రజాశక్తి-టంగుటూరు : పారిశ్రామిక సందర్శలో భాగంగా స్థానిక పేస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ఒంగోలులోని స్వాతి శ్రీ ప్లాస్టిక్‌ ఇండిస్టీస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సోమవారం సందర్శించారు. మెకానికల్‌ విభాగం ప్రథమ, ద్వితీయ చదువుతున్న విద్యార్థులు పారిశ్రామిక సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివిసి రిజిడ్‌ పైపులు తయారీ గురించి ఇండిస్టీ ప్రొడక్షన్‌ అండ్‌ క్వాలిటీ ఇన్‌ఛార్జి అశోక్‌ విద్యార్థులలకు తెలిపారు. పైపుల తయారీకి కావాల్సిన రా మెటీరియల్‌, కెమికల్‌, దాని వినియోగం గురించి వివరించారు. ఈ సందర్భంగా పేస్‌ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెట్‌ డాక్టర్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో చదువుతో పాటు విజ్ఞానాన్ని సాధించేందుకు ఇండస్ట్రీ సందర్శన ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేస్‌ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌ జి. కోటిరెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.వి.కె. మూర్తి, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డాక్టర్‌ వీరాంజనేయులు , డీన్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కె. రూపా అక్కేష్‌ , కోఆర్డినేటర్‌ సతీష్‌ పాల్గొన్నారు.

➡️