గాంధీ జయంతి సందర్భంగా చిత్రలేఖన పోటీలు

Oct 1,2024 19:43

ప్రజాశక్తి-ఒంగోలు: గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్‌ ఒంగోలు సెంట్రల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ నేపథ్యంలో చిత్రలేఖన పోటీలు బుధవారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు నిర్వహించనున్నట్లు క్లబ్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక మంగమూరు రోడ్డులోని ఫ్రీడమ్‌ బర్డ్స్‌ టాలెంట్ హంట్ లో జరుగుతాయన్నారు. అన్ని తరగతుల విద్యార్థులూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు నాయుడు మాల్యాద్రి సెల్ నెంబర్ 9848605205ను సంప్రదించాలన్నారు.

➡️