పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఎక్సైజ్ సిఐ గా మద్దాల శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన తాడేపల్లిగూడెం నుంచి బదిలీపై పాలకొల్లుకు విచ్చేశారు. ఈయన 2015 నుంచి 2019 వరకు పాలకొల్లు సిఐగా పనిచేసి పెనుగొండ బదిలీపై వెళ్లారు. శ్రీనివాసరావుకు ఎక్సైజ్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం .. నియోజకవర్గంలోని బ్రాందీ షాపులు రెస్టారెంట్ అండ్ బార్లు కచ్చితంగా అమలు చేయాలని ఆయన కోరారు. నూతన ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ లో విడుదలవుతుందని కొత్త షాపులు వచ్చే లోపు పాత షాపులు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు.