పత్తి కొనుగోలు కేంద్రాలపై పల్నాడు జెసి సమీక్ష

Oct 4,2024 00:25

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రత్తి కొనుగోలు కేంద్రాల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా స్థాయి కమిటి, మార్కెట్‌ యార్డుల కార్యదర్శులతో పల్నాడు జిల్లా జెసి సూరజ్‌ ధనుంజరు గురువారం సమీక్షింకారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరే ట్‌లో నిర్వహించిన సమీక్షల్లో సిఎంఎపిపిలో రైతుల నమోదును 100 శాతం పూర్తి చేయా లని, గుర్తించిన కొనుగోలు కేంద్రాల్లో భద్రత, తూకాలు సక్రమంగా ఉండేలా తనిఖీలు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల పరిధిలోని వే బ్రిడ్జిలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. లూజు ప్రత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులను ప్రోత్సహిం చాలన్నారు. సమావేశంలో జిల్లా అగ్రిట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి సూర్య ప్రకాష్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి ఇతర అధికారులు, సిసిఐ బయ్యర్లు పాల్గొన్నారు.

➡️