తండ్రి కొల్లి బ్రహ్మయ్యతో డాక్టర్ ఈశ్వర్ తేజ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐబిఎ) నిర్వహించే పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు వైద్యునిగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి చెందిన డాక్టర్ కొల్లి ఈశ్వర్‌తేజ నియమితులయ్యారు. ఆసియా కప్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనే భారత బాస్కెట్‌బాల్ జట్టుకు అధికారిక టీమ్ డాక్టర్‌గా కొల్లి ఈశ్వర్‌తేజ వ్యవహరించనున్నారు. చెన్నరులోని సివిత మెడికల్ కాలేజీలో పీజీ చేసిన ఈశ్వర్‌తేజ ప్రస్తుతం స్పోర్ట్ మెడిసిన్‌లో ఎమ్‌డి చేస్తున్నారు. పీజీలోనే అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆయన గంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు క్రీడా జట్లకూ వైద్యునిగా వ్యవహరించారు. డాక్టర్ ఈశ్వర్‌తేజ తండ్రి నరసరావుపేటలో కృష్ణ చైతన్య విద్యా సంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి చెందిన వైద్యులు భారత జట్టుకు వైద్యునిగా ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.