డాక్టర్ బి.రవి
రెండు గ్రామాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యటన
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రొంపిచర్ల మండలంలో వీరవట్నం, వడ్లమూడివారిపాలెం గ్రామాలలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి పర్యటించారు. ఆయా గ్రామాలలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరములను ఆకస్మికముగా తనిఖీ చేశారు. ఆయా మందిరములను పనితీరును పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించి తగు సూచనలు ఇచ్చారు. అదే విధంగా ఎన్ సిసిడి, క్యాన్సర్ స్క్రీనింగ్ లకు సంబంధించిన వివరములను అడిగి తెలుసుకొన్నారు. గర్భణీ స్త్రీల యొక్క రిజిస్ట్రేషన్ వివరాలపై ఆరా తీశారు. ఆరోగ్య మందిరములకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వారికి నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ జగన్ నరసింహారెడ్డి, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.