నేడు కూడా 144 సెక్షన్ అమలు

May 16,2024 09:56 #palnadu district

ప్రజలు, వ్యాపారస్తులు సహకరించండి..
2వ పట్టణ సిఐ భాస్కర్..

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల అనంతరం కూడా పల్నాడు జిల్లాలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని 2వ పట్టణ సిఐ ఆవుల భాస్కర్ అన్నారు. పట్టణంలో గుంపులుగా తిరగరాదని రాజకీయ ప్రకటనలు చేయరాదని హెచ్చరించారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.

➡️