అస్పృశ్యత, అంటరానితనం రూపుమాపేందుకు అలుపెరుగని పోరాటం

Apr 14,2025 11:35 #palnadu district

విజయ్ కుమార్

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల, అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా సోమవారం నరసరావుపేట పట్టణం గడియార స్తంభం సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ అస్పృశ్యత, అంటరానితనం, అమానవీయ ఘటనలపై చేసిన పోరాటం అనిర్వచనీయమన్నారు. కులం పునాదుల మీద ఒక నీతిని, జాతిని నిర్మించలేమని కుండబద్దలు కొట్టిన మహనీయుడన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరి హృదయాలలో ఉంటారని అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని ఘంటాపథంగా చెప్పిన మహానీయుడని కొనియాడారు. ఊరూరా కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా ఆయన జయంతి నిర్వహించాలన్నారు. సిఐటియు నాయకులు సిలార్ మసూద్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

➡️