ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

Apr 24,2025 17:37 #Panchayati office

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొనారు. ఈ సదర్భంగా చైర్ పర్సన్ మాటాడుతూ పంచాయతీ రాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎక్కడ లేని విధముగా మన పంచాయతీ రాజ్ వ్యవస్త ఉండటం గర్వ కారణం అని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయుటకు  అధికారులు గ్రామ స్థాయిలో పంచాయతీలు కల్పించారు. ఇందులో భాగస్వామ్యములు అయిన అన్ని శాఖల ఉద్యోగుల కన్నా పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  ప్రజలు తో నేరుగా సంబంధాలు కలిగిన ఉద్యోగులు అని తెలుపుతూ పంచాయతీ రాజ్ దినోత్సవము సందర్భంగా వారికి అభినందనలు తెలుపు తూ ఈ సందర్భంగా కొంతమంది సర్పంచులు కు ఉద్యోగులు కు సత్కారము చేశారు. ఈ కార్యక్రమం లొ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్. వెంకట్ రామన్ , విజయనగరం, జియ్యమ్మ వలస,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, మూడద్ల.శశికళ,రేగిడిఆముదాలవలస వైస్ ఎం. పీ. పి టీ. అచ్చిమి నాయుడు గ
జిల్లా పరిషత్ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.

➡️