అండర్‌ 19 కోకో పోటీలకు పందలపాక విద్యార్థిని

ప్రజాశక్తి-బిక్కవోలు (తూర్పు గోదావరి) : పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని వైరాల సుస్మిత అండర్‌ 19 రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వెళుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం నుండి తిరుపతిలో జరుగు రాష్ట్ర స్థాయి కోకో పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా టీములో సుస్మిత ఆడనున్నట్లు ప్రథమ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అభివఅద్ధి కమిటీ చైర్మన్‌ కోణాల సత్తిరాజు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువ రాజారెడ్డి క్రీడాకారిణి వైరాల.సుస్మితను అభినందించారు. చదువుకు క్రీడా సర్టిఫికెట్లు తోడైతే భవిష్యత్తులో ఉద్యోగాలకు ఉపయోగపడతాయని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️