ప్రజాశక్తి -వేటపాలెం : గత నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషనల్ ఎపి ఫని మెరిట్ టెస్ట్(ఇఇఎంటి) మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో మండల పరిధిలోని పందిళ్లపల్లి హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న సజ్జా దివ్యశ్రీ వేటపాలెం మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా సజ్జా దివ్యశ్రీకి మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెడబలిమి శేఖరరావు మాట్లాడుతూ ఎపి ఫని ఆధ్వర్యంలో 2012 నుంచి యస్. సిఇఆర్‌టి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తరగతి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను చిన్నతనం ఆన్‌లైన్‌లో డిజిటల్ పోటీ పరీక్షల్లో సిద్ధం చేసేందుకు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులలో కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, సమయ నిర్వహణ లాంటి నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సంస్థ యొక్క లక్ష్యమని తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన సజ్జా దివ్యశ్రీకి మెమోంటో, సర్టిఫికెటు, బహుమతి ఎంఇఒ చేతుల మీదుగా త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. సజ్జా దివ్యశ్రీ కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లోనూ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించాలని ఆశీర్వదించారు. అనంతరం దివ్యశ్రీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ చెరుకూరి రాంబాబు, బండ్ల భారతి, ఓల్డ్ స్టూడెంట్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి శ్రీమన్నారాయణ, కార్యదర్శి దశరథ రామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ కడెం రాముడు, ఉపాధ్యాయులు గుంటూరు శివశంకర్, ఉమ్మిటి. వేణు గోపాలరావు, బత్తుల నీలిమ, చెరుకూరి భవానీ దేవి, లలితా పరమేశ్వరి, విఎల్‌ఎన్ నరసింహం, వై. రత్నం, కొండేపి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
