ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో ఉన్న పార్కులో చేపట్టిన శ్రమదానంలో కలెక్టర్‌తోపాటు సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. పార్కులో మొక్కలు నాటి, ప్రతిజ్ఞ చేశారు. పార్కు నుంచి మెయిన్ రోడ్డు వరకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పార్కును శుభ్రం చేసేందుకు స్థానికులతో కలిసి సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. పార్కు నిర్వహణ బాధ్యతను స్థానిక కమిటీ తీసుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించాలని తెలిపారు. నియోజకవర్గం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకారంతో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గాంధీ స్ఫూర్తితో నవసంకల్పం
పార్వతీపురంరూరల్ : గాంధీ స్ఫూర్తితో నవ సంకల్పం తీసుకోవాలని ఎస్‌పి ఎస్.వి.మాధవ్‌రెడ్డి పిలుపునిచ్చారు.గాంధీ జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి ఒ.దిలీప్‌కిరణ్, ఆర్‌ఐ శ్రీరాములు, శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, డిసిఆర్‌బి ఎస్‌ఐ వి.పాపారావు, ఆర్‌ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఉన్న బాపూజీ విగ్రహానికి ఎంపిపి మజ్జి శోభారాణి, తాళ్ల బురిడిలో జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి రెవెన్యూ సిబ్బంది, సంస్కృత ఉన్నత పాఠశాలలో సాహితీ లహరి వ్యవస్థాపకులు మంచిపల్లి శ్రీరాములు నివాళులర్పించారు.
పార్వతీపురం : ఐటిడిఎ, సబ్ కలెక్టర్ కార్యాలయాలలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఐటిడిఎ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సొసైటీ సభ్యులు బి.అప్పలనరసయ్య, జిల్లా కోఆర్డినేటర్ యమ్మల జనార్థనరావు పాల్గొన్నారు. భాస్కర్ కళాశాలలో చైర్మన్ చుక్క భాస్కరరావు, డైరెక్టర్ బొంతు శ్రీనివాసరావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం.రవిశాస్త్రి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
సాలూరు : పట్టణంలోని శ్రీవెంకట విద్యాగిరి పాఠశాలలో గాంధీ విగ్రహానికి కరస్పాండెంట్ కోడూరు సాయి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ప్రాణదాత ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి.గణేశ్వరరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కోడూరు లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని బాగువలస ప్రాథమిక పాఠశాలలో గాంధీ విగ్రహానికి హెచ్‌ఎం రాజమణి నివాళులర్పించారు.
కురుపాం : సరస్వతి విద్యానికేతన్ సిబ్బంది, విద్యార్థులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గాంధీజి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ ఎం.రవణమ్మ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత.. గాంధీజీ విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆశలత, డాక్టర్ సుకృత, కరస్పాండెంట్ ఎన్.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్రీరామమూర్తి నాయుడు, టిఆర్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఐ.రామకృష్ణ ,విద్యార్థులు పాల్గొన్నారు.
కొమరాడ : విక్రంపురం సచివాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపిటిసి సభ్యులు దేవకోటి వెంకట్‌నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కలింగ మల్లిబాబు పాల్గొన్నారు.
సీతంపేట : సీతంపేట ఐటిడిఎ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎఎఒ విజయరాణి, డిప్యూటీ డిఇఒ నారాయుడు, సిఎంఒ చిరంజీవులు, జిసిడిఒ రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి తహశీల్దార్ జి.రాములమ్మ, ఎస్‌సి, ఎస్‌టి మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్.రామారావు, వైసిపి నాయకులు ఆర్‌వి పార్థసారథి పూలమాల వేసి నివాళులర్పించారు. పెదబోగిలి పంచాయతీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం జిల్లా జిల్లా అధ్యక్షులు ఎం.విశ్వేశ్వరరావు, సర్పంచ్ జొన్నాడ తెరేజమ్మ నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, ఎస్.మురళీమోహన్ నివాళులర్పించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, బి.ప్రసాదరావు మండల గౌరవాధ్యక్షులు టి. మధుసూదనరావు, నాయకులు ఎం.గోవిందరావు, బి.ఆదినారాయణ పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని తోటపల్లి, గొట్టివలస గ్రామాల్లో గాంధీ విగ్రహానికి జట్టు ట్రస్టు నిర్వాహకులు డి.పారినాయుడు, సిఆర్‌పి బోను రామకృష్ణ నివాళులర్పించారు. కార్యక్రమంలో జట్టు సిబ్బంది మార్కొండ నూకంనాయుడు, గొళ్లు మురళీ మోహన్, మరడాన గౌరీ శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి బొమ్మాల భాను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్. ఎం. మీసాల సూర్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుమ్మలక్ష్మీపురం : ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందుతున్నారంటే అది కచ్చితంగా స్వాతంత్య్ర సమరయోధుల ఫలితమేనని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి లక్ష్మణరావు, నాయకులు దాసు, చిన్న, సీతారాం, రామారావు, పురుషోత్తం, లోవరాజు పాల్గొన్నారు.
వీరఘట్టం : ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ వై.వెంకటరమణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుటిఎఫ్ జిల్లా, మండల కార్యదర్శులు ఎం.పైడిరాజు, కె.గోవిందరావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఎపిఒ జి.సత్యం నాయుడు, సీనియర్, జూనియర్ సహాయకులు ఎం.నాగభూషణ, ఎస్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట : మండలంలో పలుచోట్ల మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవనాయుడు, గ్రామ పెద్దలు ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.