టెన్త్‌ ప్రజ్ఞా వికాసం పరీక్షను విజయవంతం:ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌

Feb 11,2024 15:56 #anathapuram, #Exams, #SFI, #utf

 ప్రజాశక్తి- రాయదుర్గం(అనంతపురం) :రాయదుర్గంలో ఫిబ్రవరి 11 తేదీన పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞ వికాసం మోడల్‌ టెస్టు పరీక్షలు విజయవంతంగా ముగిశాయనిఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. స్థానిక సెయింట్‌ పాల్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్‌,యు.టి.ఎఫ్‌ జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ మాట్లాడుతూ… విద్యార్థులలో పబ్లిక్‌ పరీక్షలు అంటే భయం పోగొట్టేందుకు ఎస్‌.ఎఫ్‌.ఐ, యు.టి.ఎఫ్‌ ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పరీక్షలు నిర్వహిస్తూ ఉందని, ఈ పరీక్ష పేపర్ను ప్రముఖ విద్యావేత్త కే.ఎస్‌ లక్ష్మణరావు తయారు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల స్థాయిలో మొదటి మూడు బహుమతులు, జిల్లా స్థాయిలో టాప్‌ 10 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు . జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో చదివేటువంటి విద్యార్థులంతా ఈ పరీక్షకు హాజరై విజయవంతం చేయడం జరిగిందని వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు గౌతమ్‌ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌ వీరేష్‌, యుటిఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️