మినీ గోకులంను ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌

Jan 10,2025 13:32

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా … శుక్రవారం ఉదయం పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడు గుడి వద్ద యాతం నాగేశ్వరరావు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన మినీ గోకులంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌, ఎస్పీ.విక్రాంత్‌ పటేల్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలను పిఠాపురం కుమారపురం నుంచి లాంఛనంగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

➡️