ప్రజాశక్తి-సీతమ్మధార : జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను ఈనెల 30 నుంచి వచ్చేనెల 2 వరకు నగరంలో సేవా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 30న కాలుష్యనివారణ, పర్యావరణ పరిరక్షణకు నగరమంతటా ఐదువేల మొక్కలు నాటడం, 31న ఆర్‌కె.బీచ్‌లో పరిశుభ్రతా కార్యక్రమం, 1న ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రాజేంద్రనగర్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఇతర పార్టీల నుంచి జనసేనలో పెద్దఎత్తున చేరికలు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజున నగర పరిధిలోని 98 వార్డుల్లో బర్త్‌డే కేకు కటింగ్, వస్త్రదానం, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను వపన్‌కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేనతోపాటు కూటమి పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల వైసిపి రాక్షసపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని, దాన్ని పండుగలా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జిలు బొలిశెట్టి సత్యనారాయణ, పసుపులేటి ఉషశ్రీ, శివప్రసాద్‌రెడ్డి, అంగా ప్రశాంతి, మాజీ కార్పొరేటర్ సూర్య నారాయణ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జనసేన జిల్లా అధ్యక్షుడు వంశీకృష్