‘ఉపాధి’ కూలీల బకాయిలు చెల్లించాలి

Jun 10,2024 19:46
'ఉపాధి' కూలీల బకాయిలు చెల్లించాలి

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
‘ఉపాధి’ కూలీల బకాయిలు చెల్లించాలి
ప్రజాశక్తి-నెల్లూరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలోని పిడిని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.పుల్లయ్య, జొన్నలగడ్డ వెంకమరాజుల ఆధ్వర్యంలో కలిసి కూలీల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ సమయంలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కూలీలు పనిచేసే ప్రాంతంలో వసతులు కల్పిం చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బి. కాంతారావు, ఎం.రాధాకృష్ణమూర్తి, తంబి రమణయ్య, జి.విజరుకుమార్‌, బెల్లం కొండ నాగమ్మ ఉన్నారు.

➡️