ప్రజల రుణం తీర్చుకుంటా..

Jun 8,2024 21:58
ప్రజల రుణం తీర్చుకుంటా..

నారాయణను సన్మానిస్తున్న దృశ్యం
ప్రజల రుణం తీర్చుకుంటా..
ప్రజాశక్తి – నెల్లూరు సిటీ సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించిన నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా ప్రతి క్షణం ప్రజల కోసమే క్షేత్రస్థాయి నుంచి పని చేస్తానని నగర ఎంఎల్‌ఎ డాక్టర్‌ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గోమతినగర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన నగర ప్రెసిడెంట్లతో శనివారం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నగర సమగ్రాభివద్ధిపై వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు టిడిపి శ్రేణులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిన అభివద్ధిని రానున్న కాలంలో ఓ కార్యచరణ ప్రకారం గాడిలో పెట్టేందుకు సమాలోచనాలు నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజానాయుడు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతరెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు ఉన్నారు.

➡️