ప్రజాశక్తి-రాయచోటి 2023- 2024 మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల మూల్యాంకన విధులలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల, రెమ్యూనరేషన్ ఇంతవరకు అరకొరగా మాత్రమే చెల్లించారని, వెంటనే పూర్తి స్థాయిలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో యూటిఎఫ్‌గా ఆందోళన చేపడతామని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్ తెలిపారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాశ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎస్‌సి మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు వెంటనే వారికి చెల్లించాల్సిన టిఎ, డిఎ రెమ్యునరేషన్ వెంటనే చెల్లించేందుకు తీసుకోవాలని ప్రాతినిధ్యం చేస్తూ పది రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే డిఇఒ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 2023 ఏప్రిల్ నెలలో జరిగిన పదవ తరగతి మూల్యాంకన విధులకు సంబంధించి ఇంతవరకు పూర్తిగా రెెమ్యూనరేషన్ చెల్లించనందువల్ల గతంలో అనేకసార్లు జిల్లా విద్యాశాఖ అధికారి దష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేని కారణంగా కలెక్టర్‌ను కలిసి విన్నవించామని చెప్పారు. ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యూనికేషన్ 10 రోజుల లోపల చెల్లించాలని లేనియెడల డిఇఒ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రాయచోటి మండలం యుటిఎఫ్ నాయకులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
