డిజిటల్ విధానంలో పన్నులు చెల్లింపులు

Nov 27,2024 15:42 #Kadapa

 

డివిజనల్ పంచాయతీ అధికారి తిమ్మక్క

ప్రజాశక్తి – ముద్దనూరు : ఇంటి పన్నులు, పన్నేతరముల వసూళ్లు చెల్లింపులు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం
డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేసినట్లు జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారి తిమ్మక్క తెలిపారు.
ముద్దనూరు, నల్లబల్లె, ఉప్పలూరు గ్రామాల్లోని సచివాలయాలను బుధవారం జమ్మలమడుగు డిఎల్పీఓ తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. తిమ్మక్క మాట్లాడుతూ స్వర్ణ పంచాయతీల్లో భాగంగా ఇంటి పన్నులు పన్నేతరములు చెల్లించేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా పన్నులు, పన్నేతర వివరాలను సిబ్బంది ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ పేమెంట్ ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్లకు పన్ను విధించడం వసూళ్లు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు డిజిటల్ పేమెంట్ ద్వారా గృహ పన్నులు చెల్లించవచ్చన్నారు. పన్నులు, పన్నేతర వసూళ్లలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానం రూపొందించినట్లు చెప్పారు. డిజిటల్ పేమెంట్ ద్వారా పన్ను చెల్లించిన వెంటనే లబ్ధిదారులకు, అధికారులకు, ప్రభుత్వానికి మెసేజ్ వస్తుందన్నారు. ఇంటి పన్నులు, పన్నేతరములు పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి వీర భద్రుడు, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి నరసింహులు, విజయ భారతి, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, మహిళా పోలీసులు ఆకాంక్ష, శివజ్యోతి, డిజిటల్ అసిస్టెంట్ సాయిలత పాల్గొన్నారు.

➡️