ప్రజాశక్తి – శిరివెళ్ల : మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో సోమవారం జరిగిన పాల సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైసిపి టిడిపి మద్దతు దారులు ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పాల సొసైటీ ప్రెసిడెంట్ , డైరెక్టర్ ల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు విజయ డైరీ ఎన్నికల అధికారి కైప ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు. గురుజాల తిమ్మారెడ్డి రాం మోహన్ రెడ్డి డైరెక్టర్, ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు