రోడ్లపై పశువులను, పెంపుడు కుక్కలను వదిలితే జరిమానా

Aug 23,2024 12:26 #fine, #leaving cattle, #on roads, #pet dogs

నెల్లూరు : మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను వదలడం పై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ … పశువులు, పెంపుడు కుక్కల వలన వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్లపై పశువులను, పెంపుడు కుక్కలను వదిలే యజమానులకు జరిమానా వేస్తామని మంత్రి నారాయణ హెచ్చరించారు.

➡️