ప్రజాశక్తి-చీమకుర్తి: విచారణలో ఉన్న పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. గురువారం ఆయన చీమకుర్తి పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్‌ఐలకు పలు సూచనలు చేశారు. స్టేషన్లుకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, సమస్యలను త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి స్టేషన్ ఆవరణలో ఆవరణ పచ్చదనంతో నిండి ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు విజబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సిసి కెమెరాలపై అవగాహనా కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు తాళ్ళూరు ఎస్‌ఐ విజయకుమార్, దర్శి ఎస్‌ఐ సుమన్, చీమకుర్తి ఎస్‌ఐ వెంకట కృష్ణయ్య, ఏఎస్‌ఐ రాజమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.
