పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ ఎస్, బిపిఎస్ దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి

Apr 25,2025 16:39 #Commissioner, #nallanayya

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్, బిపిఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ప్రణాళికా సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్, బిపిఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో 3 నెలలు గడువు పొడిగించిందన్నారు. వ్యక్తిగత దరఖాస్తులను కూడా తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చొరవ చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను తమ దృష్టికి తెచ్చినట్లయితే అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. నగరంలో అనధికార ఫ్లెక్స్ బోర్డులు ఉండరాదన్నారు. పోస్టర్లు లేకుండా చూడాలన్నారు. అనధికార ప్రకటన బోర్డులు గుర్తించి అపరాధ రుసుములను విధించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి, టిపిఓ అప్పలరాజు, టిపిఎస్ అనిత పాల్గొన్నారు.

➡️