పెన్షనర్ల ధర్నాను జయప్రదం చేయాలి

Feb 6,2025 00:07 #Pensioners meeting
Pensioners meeting

 ప్రజాశక్తి -గాజువాక : ఇపిఎఫ్‌ 95 పెన్సనర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు ఎన్‌ రామారావు పిలుపునిచ్చారు. పెదగంట్యాడ సిడబ్ల్యుసిలో బుధవారం ఇపిఎఫ్‌ -95 పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌.రామారావు మాట్లాడుతూ, కనీస పెన్షన్‌ రూ.9000, దానికనుగుణంగా డిఎ ఇవ్వాలని, భార్యాభర్తలకు మెడికల్‌ సౌకర్యం కల్పించాలని, రైళ్ల ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కణితి అప్పలరాజు, దేనిబందు, నమ్మి అప్పలనాయుడు, వెంకట్రావు, సింహాసనం, సోమినాయుడు పాల్గొన్నారు.

➡️