కట్టుబడిపాలెంలో పింఛన్లు అందజేత

Oct 1,2024 13:11 #compliance, #pensions, #provided

జి.కొండూరు (ఎన్టీఆర్‌ జిల్లా) : జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కఅష్ణప్రసాదు మంగళవారం లబ్ధిదారులకు ఫించన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కఅష్ణప్రసాదు మాట్లాడుతూ … పేదలు పడుతున్న అవస్థలను గుర్తించిన సీఎం చంద్రబాబు పింఛన్ల సొమ్మును పెంచి మరీ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. జి.కొండూరు మండల వ్యాప్తంగా 8,661 మంది లబ్ధిదారులకు రూ.3,67,77,500లు పింఛన్ల సొమ్మును నేడు అందజేస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడి వారికి సొమ్మును అందజేసి, భరోసా కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక సమస్యలపై వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతా క్రమంలో తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అనారోగ్య బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కఅష్ణప్రసాద్‌కి గ్రామంలో స్థానిక నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️