పింఛన్లు అందక వెనుతిరుగుతున్న పింఛను దారులు

Apr 3,2024 16:58 #East Godavari, #Pension

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : ఏప్రిల్ 3వ తేదీన సచివాలయాల్లో సెక్రటరీలు,సచివాలయం ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేస్తారని సమాచారం ఇవ్వడంతో దూర ప్రాంతాల నుండి వస్తున్న పింఛను దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీరా వచ్చాక డబ్బు ఇంకా రాలేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. కనీసం ఒకరోజు ముందు అయిన ఈ విషయం చెబితే సచివాలయానికి రాకపోదుమంటూ పింఛను దారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవో ను వివరణ కోరగా పింఛన్లు నగదు ఇంకా క్రెడిట్ కాలేదని మధ్యాహ్నం లోపు క్రెడిట్ అవ్వచ్చని సాయంత్రంలోపు పంపిణీ చేస్తారని తెలిపారు. ఏదేమైనా అవ్వ తాతలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ అధికారులపై పింఛను దారులు మండిపడుతున్నారు.

➡️