ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి : కలెక్టర్ కు టీడీపీ నేతల వినతి

Apr 2,2024 15:07 #collector, #krishna, #TDP

ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ దారులకు ఇంటి వద్దే వెంటనే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలనీ పలువురు టిడిపి నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజా బాబు ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు,నాయకులు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట వాలంటీర్లు పెన్షన్ పంపిణీ విషయాన్నీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.ఎన్నికల కోడ్ అమలలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ తెలుగుదేశం పార్టీ కోరితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్లు సచివాలయంలో కొచ్చి తీసుకోవాలని దుర్మార్గమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ దారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే యుద్ద ప్రాతిపదికన ఫించన్లు అందించాల చర్యలు తీసుకోవాలని కోరారు.రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రూ 4 వేలు పెన్షన్ అమలు చేస్తూ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తామని నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా కార్యదర్శి పిప్పళ్ళ కాంతారావు, మండల పార్టీ అధ్యక్షుడు కుంచే దుర్గాప్రసాద్ , మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ అక్కుమతి రాజా, ఫ్లోర్ లీడర్ సమత కీర్తి, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్, గోపు నరేష్ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

➡️