గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి

Jun 8,2024 22:01
ఫొటో : మాట్లాడుతున్న సిఐ గిరిబాబు

ఫొటో : మాట్లాడుతున్న సిఐ గిరిబాబు
గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలని సిఐ వేల్పుల గిరిబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక పట్టణంలో పలు వీధుల్లో సర్కిల్‌ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు సార్వత్రిక ఎన్నికలు ముగియడం ఎన్నికల కోడ్‌ తీసివేసినట్లు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని వారికి సిఐ వేల్పుల గిరిబాబు, ఎస్‌ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి గొడవలకు తావులేకుండా ప్రశాంతంగా ఒకరికొకరు కలిసి మెలసి ఉండాలని ఎన్నికల వరకే పార్టీలని అనంతరం అందరూ కుటుంబ సభ్యుల ఉండాలన్నారు. గొడవలకు పాల్పడి పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోదరభావంతో కలిసి మెలిసి ఉండడంతో గొడవలు దూరమవుతారని ప్రతిఒక్కరూ గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకోవాలని పలు సూచనలు చేశారు.

➡️