టిడిపిని ప్రజలు ఆదరిస్తున్నారు: కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ప్రజాగళం ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిశీల కులు రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వర రావుతో కలసి 3వ రోజు ఈపురుపాలెంలో గాంధీ పార్క్‌ ఏరియా, కుమ్మరి వీధి, ముస్లిం ఏరియా పలు ప్రాంతాలలో డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ను చీరాల తెలుగుదేశం, కూటమి నాయకులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్యకు ఆ ప్రాంతవాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఇంటింటికీ సూపర్‌ సిక్స్‌ పథకాలు, బిసి డిక్లరేషన్‌ ద్వారా అమలయ్యే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, సీనియర్‌ నాయకులు కౌత్తవరపు జనార్దన్‌, మైనార్టీ నాయకులు యాసీన్‌, ఈపురుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు, బాపట్ల పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సీనియర్‌ నాయకులు గుద్దంటి చంద్రమౌళి, టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️