ప్రజల గొంతుక ప్రజాశక్తి : ఎమ్మెల్యే కందికుంట.వెంకటప్రసాద్‌

కందికుంట (అనంతపురం) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన గళమెత్తడం లో ప్రజాశక్తి ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాశక్తి తీసుకొచ్చిన 2025 నూతన క్యాలెండర్‌ ని ఎమ్మెల్యే కందికుంట చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సత్యసాయి జిల్లా ఇన్చార్జి శ్రీనివాసులు , టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌, టీడీపీ తెలుగు యువత నాయకులు, కావడి ప్రవీణ్‌ కుమార్‌, కదిరి విలేకరులు హరి, నాగేష్‌, టీడీపీ నాయకులు, మైనార్టీ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

➡️