ఏలూరు జిల్లాలో 6 పాఠశాలల అనుమతులు రద్దు

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : 2024 25 విద్యా సంవత్సరానికిగాను అనుమతులు లేని ప్రైవేట్‌ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా ఆరు గుర్తించామని వాటిని ముసివేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతి ఏడాది పాఠశాలల క్రమబద్ధీకరణ ప్రైవేట్‌ పాఠశాలలకు తప్పనిసరిగా చేయించాల్సిన అవసరం నిబంధన మేరకు ఉంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతి ఏడాది చేపడతారు. క్రమబద్ధీకరణ లేని ప్రైవేట్‌ విద్య సంస్థలను గుర్తించి జిల్లా విద్యాశాఖ అధికారులు వాటి అనుమతులను రద్దు చేస్తారు. ఆరు పాఠశాలలను ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ లేనట్టు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ఈ ఆరు పాఠశాలలను రద్దు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు.

ఆరు పాఠశాల వివరాలు ఇలా ఉన్నాయి
1) శనివరపుపేట స్వర్ణ భారతి ప్రాథమికోన్నత పాఠశాల
2) ఏలూరులోని ఎవరెస్టు విద్యాలయ ప్రాథమిక పాఠశాల
3) ఏలూరు ఎవరెస్టు విద్యాలయ ఉన్నత విద్యా సంస్థ
4) ఏలూరు వెన్నలవారి పేటలోని సన్‌ షైన్‌ ఆంగ్ల మాధ్యమ ప్రాథమికోన్నత పాఠశాల
5) జంగారెడ్డిగూడెంలోని కైరలి ప్రాథమికోన్నత పాఠశాల
6) ఆగిరిపల్లి లోని ఎన్‌ ఎస్‌ ఆర్‌ ప్రాథమికోన్నత పాఠశాల

➡️