విద్యుత్‌ స్తంభం నుంచి పడి వ్యక్తికి గాయాలు

విద్యుత్‌ స్తంభం నుంచి పడి వ్యక్తికి గాయాలు

ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలో చోద్యం జంక్షన్‌లో సోమవారం ఉదయం కరెంట్‌ స్తంభంపై నుంచి కిందకు పడి సీహెచ్‌.రమణ అనే వ్యక్తి గాయాలయ్యాడు. జంక్షన్లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంబంధించిన విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీనిని పునరుద్దించడానికి లింగంపేట పంచాయతీ శివారు రామచంద్రపురం గ్రామానికి చెందిన సిహెచ్‌.రమణ కరెంట్‌ స్తంభాన్ని ఎక్కి విద్యుత్‌ వైర్లను సరిచేసే సమయంలో స్తంభానికి పైభాగం నుండి వెళుతున్న 11కెవి విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుత్‌షాక్‌ గురై స్తంభం నుంచి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులంతా ప్రాథమిక చికిత్స చేసి గొలుగొండ పిహెచ్‌సికి తరలించారు. గాయాలపాలైన రమణ అపస్మారస్థితికి వెళ్లడంతో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. ప్రస్తుతం ఆయనకు వైజాగ్‌లో వైద్య సేవలు అందుతున్నాయి.

చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు

➡️