విద్యుత్‌ కార్మికుల సమస్యలపై వినతి

విద్యుత్‌ కార్మికుల సమస్యలపై వినతి

ప్రజాశక్తి -సీలేరు: తెలుగు నాడు విద్యుత్‌ కార్మిక సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొని, పలుసమస్యలపై విన్నవించి, యూనియన్‌పరంగా పరిష్కారచర్యలు చేపట్టాలని కోరినట్లు తెలుగు నాడు కార్మిక సంఘం రీజినల్‌ కార్యదర్శి ఎస్‌. భాస్కర్‌ వెల్లడించారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో. సీలేరులో ఎపి జెన్‌కో పరిధిలో చేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్‌ కార్మికులు ఎవరైనా మృతి చెందితే మృతదేహాన్ని భద్రపరచడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. 12 మంది పీస్‌ వర్కర్లను కాంట్రాక్ట్‌ కార్మికులుగా పరిగణిస్తూ ఎపి జెన్‌కో జెన్కో యాజమాన్యం జిఒ జారీ చేసిందని, దాన్ని తక్షణమే జెన్‌కో అధికారులు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఎపి జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న భవ్య ఆసుపత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సమావేశం దృష్టి తీసుకువచ్చామన్నారు. సరైన రవాణా సౌకర్యంలేకపోవడంతో విద్యుత్‌ ఉద్యోగులకు, కాంట్రాక్ట్‌ కార్మికులకు బయోమెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాన సమస్యలపై డిమాండ్లతో కూడిన వినతిపత్రం తెలుగునాడు విద్యుత్‌ సంఘం రాష్ట్ర నాయకులకు అందజేశామన్నారు. సమావేశంలో స్థానిక తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం బ్రాంచ్‌ అధ్యక్షులు రేఖ అప్పారావు, కాంట్రాక్ట్‌ కార్మికులు వరహాలు పాల్గొన్నారని తెలిపారు.

➡️