ప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్ : కృష్ణా విశ్వవిద్యాలయ పరిదిలో అనుబంధ కళాశాలలకు సంబంధించి పి జి, ఎల్ ఎల్ ఎం నాలుగవ సెమిస్టర్ , బిఫార్మసీ మూడవ సెమిస్టర్, బి టెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె రాంజీ విడుదల చేయడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారి డా పి.వీర బ్రహ్మచారి తెలియజేశారు. పీజీ ఎల్ ఎల్ ఎం నాలుగవ సెమిస్టర్ 95.24 శాతం, బి ఫార్మసీ మూడవ సెమిస్టర్ 92.34 శాతం, బి టెక్ మొదటి సెమిస్టర్ 68.31 శాతం ఉత్తీర్ణత సాధించారని వీర బ్రహ్మచారి తెలియజేశారు. పునఃమూల్యాంకనం కొరకు దరఖాస్తు చేసుకొనేవారు మార్చ్ 24. 2025 వరకు వెబ్సైట్ లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చని పునః మూల్యాంకన పూర్తివివరాలను వెబ్సైట్ (www.kru.ac.in ) పొందుపరచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా .పి.వీర బ్రహ్మచారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరీక్ష సిబ్బంది పాల్గొన్నారు.
