ప్రజాశక్తి – కడప అర్బన్ : క్రీడలు శారీరక దఢత్వాన్ని పెంచుతాయని కందుల విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కెఎల్‌ఎమ్ ఇండోర్ స్టేషన్‌లో బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ ఆడే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారని ఒక సర్వేను ఉటంకిస్తూ తెలిపారు. తమ ఇండోర్ స్టేడియంలో ఉన్న వసతులను క్రీడాకారులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య అతిథి, జెఎన్‌టియు స్పోర్ట్స్ కౌన్సిల్ కార్య దర్శి బి.జోజి రెడ్డి మాట్లాడుతూ ఎంపికల్లో బాగా రాణించి యూనివర్సిటీ టీంలో స్థానం పొందాలని పిలుపునిచ్చారు. కళాశాల యాజమాన్యానికి కతజ్ఞతలు తెలి పారు. కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి. రత్నమ్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తద్వారా జీవితంలో స్థిరపడతారని పేర్కొన్నారు.